ఈడీ విచారణకు నటి మంచు లక్ష్మీ..!

పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు, దర్శక నిర్మాత మోహన్ బాబు తనయ, ప్రముఖ నటి మంచు లక్ష్మీకి ఈడీ సమన్లు జారీ చేసింది. నియమనిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేశారు. కోట్ల రూపాయలు చేతులు మారాయని నెపంతో సినీ క్రీడా ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగా సినీ నటి మంచు లక్ష్మీ ఈరోజు బుధవారం ఈడీ విచారణకు హజరు కానున్నారు. నగదు లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మంచు లక్ష్మీతో నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై ఈడీ విచారణ చేయనున్నది. ఇప్పటికే ఇదే కేసులో టాలీవుడ్ స్టార్ హీరోలు రానా, విజయ్ దేవరకొండ లతో పాటు ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ను సైతం ఈడీ విచారించింది.