షాకింగ్ వీడియో.. చూస్తుండగానే కొట్టుకుపోయాడు..
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు గ్రామాల మధ్య రాకపోకలు బందయ్యాయి. అయితే.. ఓ వ్యక్తి ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువను దాటుతుండగా అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయాడు. ఈ ఘటన ఏపీలోని నూజివీడు మండలం వెంకటాయపాలెంలో జరిగింది.
వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తాడు సహాయంతో ఓ వ్యక్తి , స్థానికుల సాయంతో కాలువ దాటేందకు ప్రయత్నించాడు. అయితే.. వరద ఉధృతికి అదుపతప్పి కిందపడిపోవడంతో వరదలో కొట్టుకుపోయాడు.. అయితే, పక్కనే ఉన్న చెట్ల పొదల్లో ఇరుక్కోగా, స్థానికులు అతడిని రక్షించారు. దీంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షాకింగ్ వీడియో
నూజివీడు మండలం వెంకటాయపాలెంలో వరద ఉధృతిని దాటుతుండగా కొట్టుకుపోయిన వ్యక్తి
పక్కనే ఉన్న చెట్ల పొదల్లో ఇరుక్కోగా, స్థానికులు రక్షించడంతో తప్పిన పెను ప్రమాదం pic.twitter.com/1HzbNyGqhL
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2024



