రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. నిందితులకు ఊరట
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు ఊరట లభించింది. కేసును గుంటూరు కోర్టు కొట్టివేసింది
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు ఊరట లభించింది. కేసును గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి .. 2015 జులై 14వ తేదీన ఆచార్య నాగార్జున యునివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడింది. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె సూసైడ్ నోట్ కూడా రాసింది. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై 9 ఏళ్ల తర్వాత కోర్టు తుది తీర్పు వెల్లడిస్తూ కేసును కొట్టివేసింది. ర్యాగింగ్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు లేవంటూ గుంటూరు జిల్లా ఐదవ కోర్టు కేసు కొట్టేసింది.
అయితే సాక్ష్యాలు ఇచ్చినా కూడా వాటిని కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదంటూ రిషితేశ్వరి తల్లి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది. ఈ తీర్పుపై అప్పీల్ కి వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు ఆమె. ఈ తీఆర్పు వల్ల తమ అమ్మాయికి అన్యాయమే జరిగిందని ఆమె వాపోయారు.



