ఏపీలో రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం.. కానీ..?

ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రేపట్నుంచి నుంచి మహిళలకు ఫ్రీ బస్ స్కీంను అమలు చేయనున్నది. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు పలు ఎన్నికల హమీలను అమలు చేస్తూ వస్తుంది.
తాజాగా కూటమి ప్రభుత్వం రేపట్నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని సీఎం నారా చంద్రబాబు ప్రారంభించిన తర్వాతే జీరో ఫేర్ టికెట్ల జారీ మొదలవుతుంది.
రాష్ట్రంలోని విజయవాడ పీఎన్ బస్టాండ్ లో రేపు ఆగస్టు పదిహేను తారీఖున సా.5 గంటల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. కాగా నాన్ స్తాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి (తిరుమల), ఆల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించదు అని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.