pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Andhra Pradesh »
  • Establish A Data City In Ap Minister Lokesh

ఏపీలో డాటా సిటీ ఏర్పాటు చేయండి – మంత్రి లోకేశ్

ఏపీలో డాటా సిటీ ఏర్పాటు చేయండి – మంత్రి లోకేశ్
  • Edited By: Pallavi,
  • Published on August 18, 2025 / 12:08 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

పల్లవి, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో డాటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు, దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలి, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఎపిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ, అంతర్జాతీయస్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలకు నిరంతరం సహకారం అందించండి. వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతోపాటు నిధులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు.. వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి కి సింగపూర్ ప్రభుత్వం తో జరిగిన చర్చల గురించి లోకేష్ వివరించారు. దీనికి మీ పూర్తి సహకారం కావాలని లోకేష్ జైశంకర్ ను కోరారు.

ఎపికి చెందిన సుమారు 35లక్షల మంది ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారు. అమెరికాలో 10లక్షలు, గల్ఫ్ దేశాల్లో 8లక్షలు, ఐరోపా దేశాల్లో 4లక్షలమంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. యుఎస్ లో అక్కడ ప్రజల తలసరి ఆదాయం $70,000 డాలర్లు కాగా, ప్రవాసాంధ్రుల తలసరి ఆదాయం $1,26,000 డాలర్లుగా ఉంది. ఐరోపాదేశాలు, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, తైవాన్ లతో మొబిలిటీ, మైగ్రేషన్ (MMPA) భాగస్వామ్యాలను ఏర్పాటుచేయడంలో కేంద్రచర్యలు అభినందనీయం. ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్ ను తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఆంధ్రప్రదేశ్ పూర్తి మద్దతునిస్తింది. కార్మికుల భద్రత, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం, రాష్ట్రస్థాయిలో ఆయా ఒప్పందాలను అమలుచేయడంలో ఎపి ముందంజలో ఉంటుందని మంత్రి లోకేష్ అన్నారు.

స్కిల్ డెవలప్ మెంట్, ఇనిస్టిట్యూషనల్ పార్టనర్ షిప్స్ కోసం నైపుణ్య భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంలో ఎపి ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోంది. ఇందులో రష్యా, ఆస్టేలియా వంటి దేశాలతో కలిసి జాయింట్ ట్రైనింగ్ అండ్ ఎసెస్ మెంట్ పై ట్విన్నింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. వివిధ పారిశ్రామిక సంస్థలు, ఉద్యోగార్థులను అనుసంధానించే ఏకీకృత వేదికగా నైపుణ్యం పోర్టల్ ను త్వరలో ప్రారంభించబోతున్నాం. నైపుణ్యం కలిగిన యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కల్పించడానికి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్జానాన్ని రప్పించడానికి జపాన్, కొరియా, తైవాన్లతో కలసి మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్ షిప్ అరేంజ్ మెంట్ (MMPA) ఉమ్మడి ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టిసారించాం. ప్రపంచ డయాస్పోరా వేదికగా ఐటి, సాంకేతిక ఆవిష్కరణలు, ఉన్నత విద్య రంగంలో పెట్టుబడులు, నాలెడ్జి ట్రాన్సఫర్ కోసం ఎపి ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ యువతకు మెరుగైన విదేశీ ఉద్యోగావకాశాల కల్పనకు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు డాటా షేరింగ్ సహకారాన్ని అందించాల్సిందిగా కేంద్రమంత్రి జైశంకర్ కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • #news
  • andhrapradesh governament
  • andhrapradesh minsiter
  • big news
  • breaking news

Related News

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

Latest
  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

  • అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’

  • అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్

  • స్మృతి మంధాన రికార్డుల మోత

  • ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల

  • ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

  • పాక్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే -కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా

  • సూర్యాపేటలో దారుణం

  • కొత్త పార్టీపై కవిత సంచలన ప్రకటన

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy