ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర కార్మిక , క్రీడా శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయను సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు కలిసి క్రీడల్లో ఏపీకి ప్రధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈరోజు బుధవారం మధ్యాహ్నాం రెండున్నరకు జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం నాలుగున్నరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఆయన భేటీ అవుతారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు పెండింగ్ బకాయిలు తదితర అంశాల గురించి చర్చించనున్నారు.
రాత్రి ఏడు గంటలకు సీఐఐ స్వర్ణాంధ్రప్రదేశ్ టాస్క్ ఫోర్స్ నివేదినకు విడుదల చేయనున్నారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నారు అని సమాచారం.



