ఢిల్లీకి సీఎం చంద్రబాబు..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం, టీడీపీ ఆధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల పద్నాలుగో తారీఖున ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఈ పర్యటనలో ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల, పోలవరం ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో , సంబంధితాధికారులతో పాటుగా సీడబ్ల్యూసీ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రాంతానికి జరిగే లబ్ధితో పాటు తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన పలు అభ్యంతరాలపై చంద్రబాబు నాయుడు సమగ్ర వివరణ ఇవ్వనున్నారు. మరోవైపు ఈ నెల పదహారో తారీఖు వరకు కొనసాగే ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేందర్ మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు.



