ఆఫర్ అలాంటిది మరి : రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ.. ఎగబడ్డ జనం
చికెన్ బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. అందులో ఆఫర్ పెట్టి మరి అమ్ముతుంటేఎవరు ఊరుకుంటారు చెప్పండి.. మళ్లీ కేవలం రెండు రూపాయలకే అంటే వాలిపోరూ.. అంతేమరి.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఉషా గ్రాండ్ వద్ద తాజాగా ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. పబ్లిసిటీ కోసం ఏకంగా రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ అని బంపరాఫర్ ప్రకటించారు. ఇంకేముంది చికెన్ బిర్యానీ కోసం రెస్టారెంట్ ముందు దాదాపు 2 వేల మంది వాలిపోయారు. దీంతో అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సీఐ సుబ్రమణ్యం తన సిబ్బందితో వచ్చి ట్రాఫిక్‌ను అదుపు చేశారు. ఊహించని రెస్పాన్స్ రావడంతో నిర్వాహకులు కేవలం 200 మందికే మాత్రమే బిర్యానీ విక్రయించారు. మిగతావాళ్లు నిరాశతో ఇంటిముఖం పట్టారు.



