జగన్ కు చంద్రబాబు వార్నింగ్
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
వైఎస్ జగన్ పొదిలిలో పర్యటించిన అంశం గురించి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ” తెనాలిలో రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ ను పరామర్శిస్తారా..?. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు..?.
నిన్న పొదిలిలో కనీసం బాధ్యత లేకుండా ఎలా పర్యటిస్తారు..?. పొగాకును మేము క్వింటాల్ కు రూ పన్నెండు వేలు ఇచ్చి కొంటున్నాము. మీరు ఎప్పుడైన ఇలా చేశార ” అని వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ ” పదిహేను వేల మందిని తీసుకెళ్ళి నానా హంగామా చేస్తారా..?. నేరస్తులు రాజకీయ ముసుగులో ఇలాంటి పనులు చేస్తారు” అని జగన్ పై మండిపడ్డారు.



