రేషన్ మాఫియాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం!
అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోతున్న రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే సివిల్ సప్లైస్ శాఖ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది.
అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోతున్న రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే సివిల్ సప్లైస్ శాఖ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటనతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. రాష్ట్ర తో కలిసి రేషన్ మాఫియాపై చర్యలు తీసుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. వేల టన్నుల రేషన్ బియ్యం తరలింపులో ఎవరున్నారనేదాన్ని ఆధారాలతో సహా బయటపెట్టాలని చూస్తోంది.
వైసీపీ హయాంలో కాకినాడ పోర్టులోకి రాష్ట్ర అధికారులు ఎవరూ వెళ్లకుండా కుట్ర చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ‘మూడేళ్లలోనే రూ.45వేల కోట్ల విలువైన కోటీ 31 లక్షల టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారు. ఇంత భారీ దోపిడీ జరిగింది కాబట్టే మేం పోర్టుపై ప్రత్యేక దృష్టిసారించాం. రేషన్ డోర్ డెలివరీ పేరుతో 9వేలకు పైగా వ్యాన్లు కొని, వాటి ద్వారానే బియ్యాన్ని పోర్టుకు తరలించారు’ అని ఆరోపించారు.



