AP cabinet : ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్కు ఆమోదం
AP cabinet : సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్కు ఆమోదం పలికింది.
AP cabinet : సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్కు ఆమోదం పలికింది. ఏపీ ఎక్సైజ్ చట్టసవరణ ముసాయిదా, ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపు, పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ పరిధి పెంపు, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఆమోదం లభించింది. జ్యుడీషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయసు 61కి పెంచుతూ ఆమోదం తెలుపగా.. 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982ని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ 2024 బిల్లుకి క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. కాగా పాత చట్టంతో భూ ఆక్రమణలపై కేసుల నమోదులో ఇబ్బందులు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం అందుతున్న 80 శాతం ఫిర్యాదుల్లో భూవివాదాలే ఉన్నాయంటున్న ప్రభుత్వం, వైసీపీ హయాంలో లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు చెబుతోంది.
ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరారు. సాయంత్రం 6.30 నుంచి 7 గంటల మధ్యలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.



