పాపం.. నలుగుర్ని కాపాడి చనిపోయాడు.. భార్య 8 నెలల గర్భిణి!
విజయవాడ వరదల్లో మానవత్వం చూపి తన సోదరలతో పాటుగా మరో ఇద్దర్నీ కాపాడిన ఓ యువకుడు చివరికి చనిపోయాడు.
విజయవాడ వరదల్లో మానవత్వం చూపి తన సోదరలతో పాటుగా మరో ఇద్దర్నీ కాపాడిన ఓ యువకుడు చివరికి చనిపోయాడు. కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్(32)కు సింగ్‌నగర్‌లో డెయిరీఫాం ఉంది. ఆయనతో పాటు ఇద్దరు సోదరులు కోటేశ్వరరావు, శ్యాంసుందర్, మరో ఇద్దరు యువకులు డెయిరీఫాంలో పనిచేస్తున్నారు. ఆదివారం ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన సోదరులను, మరో ఇదర్ని కాపాడి డెయిరీఫాం షెడ్డు పైకప్పుపైకి పంపించాడు చంద్రశేఖర్. ఆ తరువాత తాళ్లతో కట్టి ఉంచిన 50 ఆవులను రక్షించేందుకు వెళ్లాడు. ఎక్కడో ఒకచోట అవి ప్రాణాలతో ఉంటాయని భావించి తాళ్లు విడదీశాడు. అనంతరం తాను కూడా ఈదుకుంటూ వెనక్కి వచ్చి పైకప్పు ఎక్కేందుకు ట్రై చేశాడు. దురదృష్టం కొద్ది కాలు జారడంతో కిందికి జారిపడి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు చంద్రశేఖర్. అతని మృతదేకహం డెయిరీఫాంకు దగ్గర్లో దొరికింది. పాపం చంద్రశేఖర్‌కు రెండేళ్ల కిందట పెళ్లి కాగా ప్రస్తుతం అతని భార్య నెలల గర్భిణి. తమను రక్షించి తమ సోదరుడు కళ్లముందే కొట్టుకుపోయాడంటూ అతని సోదరులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.



