Tirumala : తిరుమల శ్రీవారికి రూ.2కోట్ల విలువైన వైజయంతీ మాల విరాళం
తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ విరాళంగా అందించారు
తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా ఏడుకొండలవాడికి కానుకగా ఇచ్చారు. వజ్ర వైడూర్యాలు పొదిగిన ఈ మాలను ఉత్సవమూర్తులకు అలకరించనున్నారు.


తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీమాలను ఆమె అందజేయనున్నారు. మరో స్వర్ణ వైజయంతీ మాలను తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి సైతం కానుకగా సమర్పించనున్నట్లు చైతన్య తెలిపారు. శుక్రవారం పద్మావతి అమ్మవారిని దర్శించుకొని.. మాలను దేవస్థానానికి కానుకగా అందించనున్నట్లు ఆమె వివరించారు.



