హరీష్ నువ్వు ఎమ్మెల్యేవా.. ఎల్పీ లీడర్‌వా? : మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం వాడీవేడిగా ప్రారంభం అయ్యాయి. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైరయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం వాడీవేడిగా ప్రారంభం అయ్యాయి. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైరయ్యారు. ముందుగా మంత్రి నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలు చెప్పారు. దీనికి హరీశ్‌రావు స్పందిస్తూ ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. క్వశ్చన్ అవర్ లో హరీష్ రావు ఏ హోదాలో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. హరీష్ రావు అసెంబ్లీలో ఏమైనా ప్రతిపక్ష నేతనా అని నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ కు ఎల్పీ లీడర్ లేడన్న మంత్రి.. హరీష్ రావు ఏమన్న డిప్యూటీ లీడరా, ఎమ్మెల్యేనా? అని క్వశ్చన్ చేశారు. నల్గొండ ప్రజల గురించి, తన గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదంటూ తీవ్ర స్థాయిలో మంత్రి మండిపడ్డారు.



