KTR Tweet : రైతులను అరెస్ట్ చేస్తారా? .. పాగల్ పాలనలో తెలంగాణ ఆగం : కేటీఆర్
KTR Tweet : పస లేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది.
KTR Tweet : పస లేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఏలుబడిలో రైతన్నలు రోడ్డెక్కారు. హైడ్రాపై జనం తిరుగుబాటు చేస్తున్నారు. గ్రూప్స్ పరీక్షల కోసం విద్యార్థిలోకం భగ్గుమంది. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతలు కన్నెర్రజేశారు. కులగణన ప్రశ్నలపై అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంది’ అని ట్వీట్ చేశారు.
అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు!
బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు!అర్దరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా?
రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా?
ఇదేనా ప్రజాస్వామ్య పాలనా?రైతు సంక్షేమ పాలన?
ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం !…— KTR (@KTRBRS) November 12, 2024
మరోవైపు వికారాబాద్ జిల్లా లగచర్ల వివాదంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. అర్దరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా? రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఇదేనా ప్రజాస్వామ్య పాలనా?రైతు సంక్షేమ పాలన? ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం !
అర్దరాత్రి అన్నదాతల అరెస్టులు ఎందుకు? ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి.. పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతుల అరెస్టులా? మీ అల్లుడు, సోదరుల సంపాదనల కోసం.. భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్టవద్దన్నందుకు అరెస్టులా? రైతుల అరెస్టులను ఖండిస్తున్నాం..పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నాం. లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.



