రెండు ఏనుగులు మధ్యలో పువ్వు.. విజయ్ పార్టీ జెండాకు మీనింగ్ ఇదే!

తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించి పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్.. పార్టీలో కీలక ఘట్టమైన జెండాను అవిష్కరించారు. చెన్నైలోని పనయూర్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 9గంటలకు పార్టీ జెండాను ఆయన అవిష్కరించారు. జెండా ఎరుపు, పసుపు రంగులను కలిగి ఉండగా.. ఇందులో రెండు ఏనుగులు, మధ్యలో ఒక పువ్వు కూడా ఉన్నాయి. అయితే ఇంతకీ ఈ జెండాలోని మీనింగ్ ఎంటో తెలుసుకోవాలని చాలా మంది విజయ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అటు విజయ్ కూడా జెండా వెనుకున్న అర్థాన్ని త్వరలోనే చెబుతానంటూ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
సాధారణంగా ఏ రాజకీయ పార్టీ జెండా వెనుక అయిన ఓ అర్థం ఉంటుంది. ఆ విధంగా విజయ్ తమిళగ వెట్రి కజగం జెండా వెనుక కూడా ఓ అర్థం ఉంది. ఎర్ర జెండాపై రెండు ఏనుగులు వంకరగా నిలబడి మధ్యలో ఒక పువ్వు ఉంది. ఆ పువ్వ పేరు వాగాయ పుష్పం .. చుట్టూ నక్షత్రాలు రింగ్ లో కనిపిస్తున్నాయి. మనమందరం ఏనుగును బలమైన జంతువుగా చూస్తాం. దీని ప్రకారం ఈ పార్టీ జెండాపై ఉన్న ఏనుగుకు బలమైన అర్థం ఉందని చెప్పారు. అలాగే, వాటి మధ్య ఉన్న పువ్వుకు అర్థం విజయం. అంతే కాదు, పువ్వులు చాలా పెళుసుగా ఉంటాయి. వాటిని రక్షించడానికి బలమైనది ఏదో అవసరం. అందుచేత, పువ్వు అందంగా ఎదగడానికి రక్షణ కోసం చుట్టూ బలమైన జంతువులను ఉంచడం ఈ జెండా యొక్క అర్థం.
పువ్వు విజయానికి ప్రతీక అని అందరికీ తెలుసు. నటుడు విజయ్ కూడా రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి పలు వేదికలపై మాట్లాడినప్పుడల్లా విజయం ఖాయం అని చెబుతూనే వస్తున్నారు. తమిళనాడు చరిత్రలో వాగాయ పుష్పానికి చాలా గుర్తింపు ఉంది. అప్పట్లో చోళులు, పాండ్యులు పరిపాలించిన సమయంలో యుద్ధంలో గెలిచిన వారికి ఈ పూలతోనే దండలు చేసి స్వాగతం పలికేవారు. అందుకే ఈ పూలని విజయానికి ప్రతీకగా చూస్తారు. ఇప్పుడు విజయ్ తన జెండాపై ఈ పువ్వును పెట్టడం విజయానికి సూచికగా భావిస్తున్నారు ఫ్యాన్స్.
Related News
-
నాదర్గుల్ DPSలో SLC కార్యక్రమం
-
భారత్ – బంగ్లా మధ్య ప్రపంచ భవిష్యత్ ప్రణాళిక సమావేశం
-
పల్లవి స్కూల్లో పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ సెషన్
-
బోయిన్ పల్లి పల్లవి స్కూల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
-
ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ టోర్నమెంట్లో పల్లవి స్కూల్ హవా
-
అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు