రెడ్ బుక్ తో వైసీపీ నేతలకు గుండెపోటు – మంత్రి లోకేశ్

పల్లవి, వెబ్ డెస్క్ : ఐదేండ్ల తమ అరాచక పాలనపై కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన రెడ్ బుక్ పేరు ఎత్తితే చాలు వైసీపీ నేతలకు గుండెపోటు వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు .
మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి లోకేశ్ ” పిల్లలను చదివించేందుకు ఏ తల్లి ఇబ్బంది పడకూడదనే తల్లికి వందనం అమలు చేస్తున్నాము.
కూటమి సర్కార్ లో మహిళలకు ఎనలేని గౌరవం ఇస్తున్నాం. కానీ వైసీపీ ఐదేండ్ల అరాచక పాలనలో స్త్రీలను కించపరిచారు. అగౌరవపరిచారు.
కానీ మా కూటమి ప్రభుత్వం మాత్రం మహిళల గౌరవం పెరిగేలా చర్యలు తీసుకుంటుంది” అని ఆయన పేర్కొన్నారు.