తెలంగాణ ఆడబిడ్డలను రేవంత్ అవమానించిండు: మంత్రి కేటీఆర్
సీఎంగా కొనసాగేందుకు రేవంత్ రెడ్డి అనర్హుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని సీఎం రేవంత్ మాట్లాడడం శోచమనీయమన్నారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి మాత్రమే కాకుండా తెలంగాణ ఆడబిడ్డలందరినీ అవమానించేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు సీఎంకు తగులుతుందన్నారు. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు.. కానీ ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ సిగ్గు తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు
సీఎం పదవికి రేవంత్ అనర్హుడు
ఏ మొహం పెట్టుకుని వచ్చావని డిప్యూటీ సీఎ భట్టి అనడం సరికాదని కేటీఆర్ అన్నారు. ఆడబిడ్డల గురించి అలా మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మా పార్టీ మహిళా ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉండి కష్టపడి గెలిచారు.రేవంత్ లాగా పార్టీ మారి పదవులు తెచ్చుకున్న వారు కాదు. మేం పదేళ్లు అధికారంలో ఉన్నాం. ఏనాడు ఆడబిడ్డలను అవమానించలేదు. సీఎంను ఏకవచనంతో పిలవలేదు. అది కేసీఆర్ మాకు నేర్పించిన సంస్కారం. అసెంబ్లీలో తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం దేశం మొత్తం చూసింది. వెంటనే సీఎం క్షమాపణలు చెప్పాలి’ అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నేర్పించిన సంస్కారం. ఈరోజు మా తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం దేశం మొత్తం చూసింది. ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు రేవంత్ రెడ్డి అనర్హుడు’’ అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.



