వాళ్లకు ABCDలు రావు: కిషన్ రెడ్డి
వాళ్లకు ABCDలు రావు: కిషన్ రెడ్డి

పల్లవి, హైదరాబాద్: ఎ, బీ,సీ,డీ తెలియకుండా కేంద్రంపై యుద్ధం చేయాలంటే ఎలా? దక్షిణ భారతదేశంలో గతంలో లాగా ప్రజలను రెచ్చగొడితే ప్రజలు ఊరుకోబోరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా మోదీ నాయకత్వంలో అన్ని భాషలకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని రాజకీయ దురుద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మీ పప్పులు ఉడకబోవన్నారు. డీ లిమిటేషన్ ప్రకారం సీట్లు తగ్గుతాయని ఎలా? భావిస్తారని ప్రశ్నించారు. తమిళ నాడు ఎన్నికల్లో భాగంగానే ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు డీఎంకే స్టాలిన్ పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమిళభాషలో తీసిన సినిమాలు హిందీలో ఉత్తర భారతదేశంలో ప్రదర్శిస్తూ వందల వేల కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. అత్యధికంగా తెలుగు, తమిళ సినిమాలను ఉత్తరాదిలోనూ ఆదరిస్తున్నారని అన్నారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లాంటి అనేకమంది ప్రజలు తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారని అన్నారు. స్టాలిన్ ఐదు సంవత్సరాలుగా సీఎంగా ఏం చేశారో? చెప్పాలని నిలదీశారు. ఏం చేయలేదు కాబట్టే భాషా పేరుతో, డీ లిమిటేషన్ పేరుతో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో విధానం ఉన్నట్లు డీ లిమిటేషన్ విధానం ఉంటుందన్నారు. ఇంతవరకు జనాభా గణనే పూర్తి కాలేదని, నియమ నిబంధనలు రూపొందించలేదని అన్నారు. తమిళనాడులో త్రిభాష పాలసీ కొత్తది కాదన్నారు. గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇదే విధానం కొనసాగుతుందని, ఇప్పుడు కూడా ఇదే కొనసాగుతుందన్నారు. దక్షిణ భారతదేశంలో తెలంగాణ, తమిళనాడులో ఏ ఒక్క వ్యక్తిపైన బలవంతంగా హిందీ నేర్చుకోవాలని బలవంతపెట్టలేదన్నారు. చైనా, జపాన్ దేశాలు కూడా వారి వారి భాషల్లోనే మాట్లాడుతున్నాయన్నారు. సీఎం స్టాలిన్ భాషపై పూర్తి అవాస్తవాలను మాట్లాడుతున్నారని అన్నారు. ఐదు సంవత్సరాలుగా తమిళ భాష కోసం ఏం చేశారో? చెప్పాలని నిలదీశారు. ప్రధాని మోదీ నూతన ఎడ్యుకేషన్ పాలసీ వచ్చాక మాతృభాషలోనే హయ్యర్ విద్యకు అవకాశం కల్పించామన్నారు.