ప్రపంచాన్ని గెలిచి..ప్రేమలో ఓడిన రతన్ టాటా
రతన్ టాటా.. భారత పారిశ్రామిక రంగానికి కొత్త దశ, దిశ చూపిన వ్యక్తి. ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యోగులను సొంత కుటుంబసభ్యుల్లా చూసుకున్నారు. ఇక సేవా గుణంలో ఆయనను మించిన వ్యాపారవేత్త లేడు. సంపద ఎంత ఉన్న సామాన్యుల కోసం ఆలోచించిన కోటీశ్వరుడు టాటా. యువతకు చెప్పేందుకు ఆయన జీవితంలోని చాలా స్టోరీలు ఉన్నాయి. కానీ రతన్ టాటా జీవితంలో ఓ ఫెయిల్యూర్ స్టోరీ కూడా ఉంది. అదే ఆయన ప్రేమ కథ.
బిజినెస్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకున్న రతన్ టాటాకు ఓ లవ్ స్టోరీ ఉన్నది. అమెరికాలోని ఆస్టిన్ యూనివర్సిటిలో గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత రతన్ టాటా లాస్ ఏంజెల్స్‌లో ఓ జాబ్‌లో చేరారు. అక్కడ జాబ్ చేస్తున్న టైమ్‌లోనే ఓ యువతితో ఆయన ప్రేమలో పడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా వీళ్ల పెళ్లికి ఓకే అన్నారు. కానీ ఇదే సమయంలో రతన్ నాయనమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన ఇండియాకు వచ్చారు. అయితే అప్పుడే భారత్ – చైనా యుద్ధం మొదలైంది. ఈ యుద్ధమే వారి ప్రేమకు విలన్‌గా మారింది. యుద్ధ భయంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెను భారత్‌కు పంపించేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది.
ఆ తర్వాత కొన్నాళ్లకు రతన్ టాటాకు ఊహించని విషయం తెలిసింది. తాను ప్రేమించిన అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసినట్లు తెలియడంతో ఆయనకు ఏం చేయాలో తోచలేదు. ఆ తర్వాత పూర్తిగా ఇండియాకు వచ్చి.. పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. కానీ ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదనే బాధ రతన్ టాటా జీవితంలో అలానే ఉండిపోయింది. ఇదే కాకుండా రతన్ టాటాకు మరో మూడు ప్రేమ కథలు ఉన్నాయని చెప్తుంటారు. బాలీవుడ్ నటి సిమి గారేవాల్‌తో రతన్ టాటా లవ్ జర్నీ చాలా దూరం సాగిందని.. కానీ పెళ్లి వరకు చేరుకోలేదనే ప్రచారం ఉంది.
ఫ్యామిలీ లేకపోవడంతో కొన్నిసార్లు తాను ఒంటరిగా ఫీలయ్యానని రతన్ పలు సార్లు చెప్పారు. పెళ్లి జరగకపోవడానికి సరైన సమయం దొరకకపోవడం కూడా ఓ కారణమని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలలిపారు. పదేళ్ల వయసులో తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని.. దాంతో తన సోదరుడు, తాను ఇబ్బందులుపడినట్లు చెప్పారు. ఆ రోజుల్లో విడాకులు అనేవి సహజం కాదని.. తన తల్లి రెండో పెళ్లిపై స్కూల్‌లో ఇతర విద్యార్థులు ర్యాగింగ్ చేసేవారని అప్పట్లో గుర్తు చేసుకున్నారు. అయితే తమకు నాయనమ్మ గౌరవంగా బతకడం నేర్పిందని.. అవి ఎప్పటికీ తనలో ఉంటాయని తెలిపారు. వ్యాపారరంగంలో సూపర్ సక్సెస్‌గా నిలిచిన తర్వాత చాలా సమయాల్లో పెళ్లి ఆలోచన వచ్చినా.. కుటుంబానికి సరైన సమయం కేటాయించలేననే భయంతో పెళ్లికి దూరంగా ఉన్నట్లు రతన్ టాటా వివరించారు.
Related News
-
మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబానికి ప్రధాని మోదీ పరామర్శ
-
రతన్ టాటా వీలునామాలో పనిమనుషుల పేర్లు
-
Video: రతన్ టాటా సొంత తమ్ముడు ఇతనే.. ఫోన్ కూడా వాడడు!
-
రతన్ టాటా గురించి ఈ విషయాలు మీకు తెలుసా
-
నువ్వు దేవుడివయ్యా : తాజ్ హోటల్ పై ఉగ్రదాడి..ఉద్యోగులకు టాటా సాయం ఇదే
-
రతన్ టాటా బెస్ట్ ఫ్రెండ్,అసిస్టెంట్ మన తెలుగోడే!



