రతన్ టాటా వీలునామాలో పనిమనుషుల పేర్లు
అనారోగ్య సమస్యలతో అక్టోబర్ 9న రతన్ టాటా గారు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. దివంగత రతన్ టాటా గారికి సంబంధించిన మరో ఆకస్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ర
అనారోగ్య సమస్యలతో అక్టోబర్ 9న రతన్ టాటా గారు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. దివంగత రతన్ టాటా గారికి సంబంధించిన మరో ఆకస్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రతన్ టాటా గొప్ప పారిశ్రామికవేత్తనే కాదు, గొప్ప మానవతావాది,జంతు ప్రేమికుడు కూడా. టాటా రాసిన వీలునామాలో తన పెంపుడు కుక్క టిటో పేరు కూడా ఉందట. టినో జీవితకాల సంరక్షణ ఖర్చుల కోసం టాటాగారు కొంత డబ్బులను కేటాయించారట. ఆ బాధ్యతలను చాలాకాంలగా తన దగ్గర పనిచేస్తున్న వంటమనిషి రాజ్ న్ షాకు అప్పగించారు.
రతన్ టాటా గతంలో టినో అనే కుక్కు పెంచుకున్నారు. అయితే అది చనిపోయిన తర్వాత మరో కుక్కని దత్తత తీసుకొని దానికి అదే పేరు పెట్టి చాలా ప్రేమగా చూసుకున్నారు. అంతేకాకుండా తన దగ్గర దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తూ తోడుగా ఉన్న వ్యక్తిగత సహాయకులు రాజన్ షా,సుబ్బయ్య పేర్లను కూడా వీలునామాలో పెట్టారంట టాటాగారు. ఇక,టాటా ఫౌండేషన్, సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరి షిరీన్, డియన్నా జిజోబీ, ఇంటి సిబ్బంది, ఇతరలకు రతన్ టాటా తన సంపదను పంచిపెట్టారు



