Video: రతన్ టాటా సొంత తమ్ముడు ఇతనే.. ఫోన్ కూడా వాడడు!
ముంబైలో ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో నిరాండబర జీవితాన్ని గడుపుతున్నారు.
రతన్ టాటా…ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఓ నమ్మకం..ఓ బ్రాండ్. ఎంత సంపాదించినా కూడా విలువలతో ఎలా బ్రతకాలో ఆయనను చూసే నేర్చుకోవాలి అని ప్రజలు అంటుంటారు. 86 ఏళ్ల వయస్సులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో రతన్ టాటా తుదిశ్వాస విడిచారు. చివరి శ్వాస వరకు ‘కంట్రీ ఫస్ట్’ అనే సిద్ధాంతాన్ని అనుసరించిన ఆయన మరణ వార్త తెలిసి యావత్ భారత్ కన్నీరుపెట్టుకుంది.
విలాసవంతమైన జీవితం కంటే విలువలతో కూడిన జీవనం కొనసాగించేందుకే ఇష్టపడిన రతన్ టాటాకు సొంత తమ్ముడు ఉన్నారని మీకు తెలుసా. రతన్ టాటా సొంత తమ్ముడి పేరు జిమ్మీ నావల్ టాటా. ఆయనకు డబ్బుపై కానీ, విలాసాలపై కానీ పెద్దగా ఆసక్తి లేదు. టాటా గ్రూప్ లో జిమ్మీకి కూడా వాటా ఉంది. అయితే కుటుంబ వ్యాపారంపై జిమ్మీకి అస్సలు ఆసక్తి లేదు.
అన్న రతన్ టాటాలాగే అరుదైన వ్యక్తిత్వం కలిగిన జిమ్మీ..ముంబైలో ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో నిరాండబర జీవితాన్ని గడుపుతున్నారు. చాలా లో ఫ్రొఫైల్ మెయింటెయిన్ చేసే జిమ్మీ.. మొబైల్ ఫోన్ కూడా వాడరు. బుక్స్, న్యూ పేపర్ల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు ఆయన ఇష్టపడతారు. ఫ్లాట్ వదలి పెద్దగా బయటికి కూడా వెళ్లరు. గతేడాది జనవరిలో జిమ్మీ పుట్టినరోజున రతన్ టాటా తన తమ్ముడితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో జిమ్మీ గురించి సాధారణ జనానికి తెలిసింది. తన అన్న మరణవార్త తెలుసుకున్న జిమ్మీ ఇవాళ వీల్ చైర్ లో వెళ్లి తన అన్నకి నివాలులర్పించారు.



