రాజాసింగ్ రాజీనామాకు ఆమోదం !

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను అప్పటి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు.
తాజాగా రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తనను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికను నిరసిస్తూ రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు.