గద్దర్ అవార్డులకు నోటిఫికేషన్
గద్దర్ అవార్డులకు నోటిఫికేషన్

పల్లవి, వెబ్ డెస్క్: తెలంగాణ చలనచిత్రాలకు సంబంధించిన గద్దర్ అవార్డుల కోసం టీఎఫ్డీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అవార్డుల కోసం దరఖాస్తు ఫారాల నోటిఫికేషన్ బుధవారం విడుదల చేసింది. ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఏసీ గార్డ్స్ లోని టీఎఫ్డీసీ సంబంధిత ఆఫీసులో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దరఖాస్తులను 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తామని తెలిపింది. ఫీచర్ ఫిల్మ్స్, జాతీయ సమైక్యతపై చలన చిత్రం, బాలల చలన చిత్రం, పర్యావరణం/హెరిటేజ్/ చరిత్రలపై చలన చిత్రం, డెబ్యూట్ ఫీచర్ ఫిల్మ్స్, యానిమేషన్ ఫిల్మ్, సోషల్ ఎఫక్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, తెలుగు సినిమాలపై బుక్స్/ విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆర్టిస్టులు/ టెక్నీషియన్లు తదితర విభాగాల్లో అప్లికేషన్లకు ఆహ్వానం పలికింది టీఎఫ్డీసీ. దరఖాస్తు ఫారాలతోపాటు “ది మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్” పేరిట చెక్కులు/డీడీలను పంపాలని పేర్కొంది.
ఎంట్రీ, అప్లికేషన్ ఫీజు వివరాలు
ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ ఫీజు – రూ.11,800, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ – రూ.3,540, బుక్స్, క్రిటిక్స్ – రూ.2360, మిగిలిన అన్ని విభాగాలకు – రూ.5900.