రూ.100కోట్ల క్లబ్ లోకి ‘కుబేర’

పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా , తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధానపాత్రల్లో నటించిన మూవీ కుబేర.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ హిట్ టాక్ తో సునామీ కలెక్షన్లను కురిపిస్తుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి రూ. వంద కోట్లకుపైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా బాలీవుడ్ నటుడు జిమ్ సర్భా కీలక పాత్ర పోషించాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.