బ్యాంకును ముట్టడించిన రైతులు.. రుణమాఫీ కాలేదని ఆగ్రహం

కామారెడ్డి జిల్లా రెంజల్లో రైతులు శనివారం కెనరా బ్యాంకును ముట్టడించారు. అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదంటూ బ్యాంకు ముందు ధర్నా చేశారు. రుణమాఫీ కాలేదని గత 15 రోజులుగా అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదని మండిపడ్డారు. రుణాలను తక్షణమే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.