వారికి రైతు భరోసా నిధులు విడుదల

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఓఆర్ఆర్ లోపల ఉన్న సాగు భూములకు రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ప్రకటించారు.
అన్నట్లుగానే మొత్తం 75,525 మంది రైతుల ఖాతాల్లో రూ.65.82 కోట్ల నిధులను జమచేసినట్లు మంత్రి తుమ్మల తాజాగా వెల్లడించారు. సాగులో లేని , సాగుకు అనువు కాని భూములు, వెంచర్లను ఈ పథకం నుంచి మినహాయించినట్లు మంత్రి తెలిపారు.
కాగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 69.39 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల్లోనే 8,744.13 కోట్ల రూపాయలను జమ చేసింది.