నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన

పల్లవి, వెబ్ డెస్క్ : లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో ఇరవై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మంచి జోష్ లో ఉంది ఇంగ్లాండ్ జట్టు. భారత్ జట్టుతో ఈనెల ఇరవై మూడో తారీఖున ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు ఇంగ్లీష్ తమ జట్టును ప్రకటించింది.
మూడో టెస్టులో గాయపడిన బషీర్ స్థానంలో లియామ్ డాసన్ ను తీసుకున్నారు. ఇతను 2017లో ఇంగ్లండ్ తరఫున ఆఖరి టెస్టు ఆడారు.ఇంగ్లాండ్ జట్టు ఇలా ఉంది. స్టోక్స్ (కెప్టెన్), ఆర్చర్, అట్కిన్సన్, బెథెల్, బ్రూక్, కార్సే, క్రాలీ, డాసన్, డకెట్, పోప్, రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, వోక్స్ తదితరులు.