BSNL యూజర్స్ కు గుడ్ న్యూస్.. కొత్త ప్లాన్ అదిరిపోయింది

ఇటీవల ప్రైవేట్ టెలికామ్ రంగ సంస్థలు జియో, ఎయిర్ టెల్ వొడాఫోన్ లు తమ ప్లాన్ లను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై అసంతృప్తిగా ఉన్న వినియోగదారులు .. ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎస్ ప్లాన్లపై సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీఎస్ఎల్ కూడా చౌకైన రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా మరో సూపర్ ఆఫర్ ను తీసుకొచ్చింది బీఎస్ఎస్.
BSNL తన వినియోగదారుల కోసం 35 రోజుల చెల్లుబాటుతో చాలా చౌకైన రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇది దాదాపు 100 రూపాయల ధరలో లభిస్తుంది. BSNL తన వినియోగదారులను ఆకర్షించడానికి కేవలం 107 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌తో 35 రోజుల సుదీర్ఘ వాలిడిటీ ఇస్తున్నట్లు ప్రకటించింది. కాలింగ్, డేటా సౌకర్యాలు అందిస్తోంది.
తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం చెల్లుబాటు కాలింగ్, డేటా సౌకర్యాలు కావాలనుకునే వారు రూ.107 రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో కంపెనీ వినియోగదారులకు 2000 నిమిషాల కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఇక, మొత్తం 35 రోజుల పాటు 3GB డేటా వినియోగాన్ని పొందుతారు. అయితే, ఉచిత SMS సౌకర్యాన్ని ఈ ప్లాన్ లో లేదు. తక్కవు కాలింగ్, డేటా కావాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ప్లాన్.