LIVE UPDATES : బీసీ గర్జన లైవ్ అప్డేట్స్
రాజ్యాధికారమే లక్ష్యంగా మిర్యాలగూడ లో బీసీ గర్జన సభజరుగుతుంది. ఈ సభకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..

-
బీసీలు వెనకబడిన వారు కాదు.. బీసీలు అంటే బిగ్ క్లాస్ : తీన్మార్ మల్లన్న
– బీసీల గర్జన జరుగుతున్నది రమ్మని పిలిస్తే.. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
– గత కొన్ని రోజుల నుంచి ఈ మిర్యాలగూడ సభ మీద.. కుట్ర జరుగుతున్నది.
– ఇవాళ ఇద్దరు ముగ్గురు మంత్రులు.. నల్గొండ జిల్లాలోనే సభ పెట్టారు. ఎందుకంటే ఈ బీసీ సభ గురించి ఎక్కడా రావద్దనేది.
– మిర్యాలగూడ ఎమ్మెల్యేనే.. ఇక్కడ చివరి ఓసీ ఎమ్మెల్యే.
– ఈ నల్గొండ జిల్లా మాది అంటున్నడు.. ఒకాయన. ఎవరిది నల్లగొండ బీసీలది.
– ఏ నల్లగొండ నుంచైతే బీసీల నాయకత్వాన్ని సమాధి చేశారో.. వారికి మా వడ్డెర సోదరులు మంచి గనేట్లు కొట్టి రాజకీయ సమాధి కడ్తరు.
– నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన.. రైట్ టు రికాల్ గురించి నేను చెప్పిన. తీన్మార్ మల్లన్న పనితనం నచ్చలేదని చెబితే.. ఇప్పుడే రాజీనామా చేస్తా.
– ఎమ్మెల్యేల్లారా? మీకు దమ్ముంటే.. నా పనితనం నచ్చిందా అని ప్రజలను అడగండి.
– తీన్మార్ మల్లన్న ఎవరి దయాదక్షిణ్యాల మీద పదవిలోకి రాలేదు.
– మిర్యాలగడ్డ మీద నుంచి సవాల్ చేస్తున్న.. మిమ్మల్ని సమాధి చేయకుంటే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు.
– పిడికెడు మందిలేరు మీరు.. బీసీలకు బిచ్చమెస్తరా? 1993 నుంచి 2024 వరకు ఈ మిర్యాలగూడకు బీసీ ఎమ్మెల్యే కాలేదు.
– కొండా లక్ష్మణ్ బాపూజీ, బెల్లిలలిత త్యాగాల ముందు.. వీరి త్యాగాలు ఎంత?
– తమిళనాడులో 237 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. 8 మంది ఓసీలే ఉన్నరు. రేపు తెలంగాణలో అదే పరిస్థితి వస్తుంది.
– బీసీలకు రావాల్సిన ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో అగ్రవర్ణాలు తన్నుకుపోతున్నరు.
– ఆరు గ్యారంటీల సంగతి నాకు అవసరం లేదు కానీ.. ఆరు కుటుంబాల గురించి నాకు అవసరం.
– మిర్యాలగూడ చోట ఒక్కటే కాదు.. 119 సభలు పెడ్తం.
– ఆటం బాంబు అంటుకున్నది. ఎవరి ఇంటి మీద పడ్తదో తెల్వదు.
– ఎవరన్న వచ్చి మేము దార్ కార్లం అంటే.. పండపెట్టి తొక్కాలి.
– బీసీల తెరువు ఎవరు వచ్చినా.. చీరి చింతకు కడ్తం.
– బీసీ ఉద్యోగులకు బీసీ సమాజం మొత్తం అండగా ఉంటదు.
– బీసీలకు ట్యాలెంట్ ఉన్నా.. మంచి పోస్టులు దక్కడం లేదు.
– బీజేపీకి కూడా నేను చెప్తున్నాను.. మోదీజీ కులగణన చేస్తవా.. కుర్చీ ఖాళీ చేస్తవా?
– తెలంగాణలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా లేడు.
– బీసీలకు పరిపాలన చేతకాదని అగ్రవర్ణాలు అంటున్నారు.
– పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు.. మీకు ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినయ్? మీకు కాంట్రాక్టులు ఎక్కడి నుంచి వచ్చినయ్.
– 7 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఎవడయ్య సొమ్ము తెచ్చి కట్టాలి దొంగ నా కొడుకుల్లారా? మీ ఆస్తులు అమ్మి కట్టండి.
– బీసీల పిల్లలు సర్కారు బడుల్లో చదువుతున్నారు.. అందుకే అక్కడ సౌకర్యాలు లేవు.
– బీసీల బిడ్డలంతా.. వినాయక చవితి, దుర్గామాత, అయ్యప్ప మాలల చుట్టూ తిరుగుతుంటే.. రెడ్ల పిల్లలు అసెంబ్లీ చుట్టూ, చట్టాల చుట్టూ తిరుగుతున్నారు.
– 70 ఏండ్ల నుంచి బీసీల బతుకులు మారలేదు.. అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అని.
– బీసీలు వెనుకబడిన తరగతులకు చెందినవారని గుర్తించడానికే.. 50 ఏండ్లు పడితే.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడానికి మాత్రం ఒక్క రోజు కూడా పట్టలేదు.
– ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో బీసీల ఉద్యోగాలు ఓసీలు ఎత్తుకుపోతున్నారని రేవంత్ రెడ్డికి చెబితే.. చూస్తాం.. పరిశీలిస్తాం.. అని అంటున్నారు.
– ఈగోలతో మన ఈపులను మనమే కొట్టుకున్నం. మన ఈపులే కొట్టుకున్నం. ఇగ బంజేయాలి.
– బీసీలు వెనకబడిన వారు కాదు.. బీసీలు అంటే బిగ్ క్లాస్.
– తెలంగాణలో ఉన్న 120 కులాలు ఒకే తల్లిబిడ్డలు.
– నాకు రెడ్ల ఓట్లు వద్దు అనడానికి.. 70 ఏండ్లు పడుతుందా? రెడ్లు కూడా బీసీల ఓట్లు అడగొద్దు.
– ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ అయిపోయింది. టీచర్స్ ఎమ్మెల్సీ వస్తున్నది. పూల రవీందర్ ఒక బీసీ బిడ్డ అని.. నలుగురు ఓసీలను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీసీలంతా.. ఏకమవుతారు. పూల రవీందర్ ను గెలిపిస్తారు.
– హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నం.
– జానా రెడ్డి కుటుంబం నుంచి ఒక్క చుక్క రక్తం కింద పడలేదు.. తెలంగాణ ఉద్యమంలో కానీ నాగరాజు బతుకు మారలేదు. పదవులు మీకు.. కష్టాలు బీసీలకా?
– కులగణన తర్వాత.. లెక్కలు బయటకొచ్చిన తర్వాత.. నాగరాజుకు ఎంత అన్యాయం జరిగిందో చెబుతాం.
– మరో మీటింగ్.. త్వరలోనే నల్గొండ నడిబొడ్డున పెట్టబోతున్నం.
-
నా మీద పెట్టని కేసు లేదు : విద్యాసాగర్
విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే
– నేను చేయని పోరాటం లేదు.. నా మీద పెట్టని కేసు లేదు.
– నేను లేకుంటే.. నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ లేదు.
– మనం చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నం.. ఇప్పుడు మల్లన్న బయటకు వచ్చాడు. నేను రెండు గంటలు ఆలోచించిన. ఆయన సమర్థుడు అని భావించిన తర్వాత ఆయనకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన.
– ముఖ్యమంత్రిగా తీన్మార్ మల్లన్నను చూడాలని నేను కోరుకుంటున్న.
– వేముల వీరేశంకు టికెట్ ఇవ్వకుంటే.. నేను పట్టుబట్టి టికెట్ ఇప్పించిన.
–మనమంతా బీసీల కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది.
-
రెండు ఉద్యమాలు నల్గొండలోనే ప్రారంభం : చెరుకు సుధాకర్
– తెలంగాణలో బీసీల కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడు సూర్యాపేటలో మహాసభ పెట్టాం..
– ఇవాళ మిర్యాలగూడలో బీసీల సభ పెట్టినం.. రెండు ఉద్యమాలకు నల్గొండలోనే ప్రారంభమయ్యాయి.
– చనిపోయిన మన పిల్లల సాక్షిగా అడుగుతున్న ఎంత మంది బీసీల రాజకీయ భవిష్యత్తును పురిట్లోనే అగ్రవర్ణాలు నాశనం చేశారో మనకు తెలిసిందే.
– మీరంతా ఆధిపత్య రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది.
– ప్రతి ఒక్కరూ రేపటి నుంచి బీసీల కార్యాచరణ మొదలు పెట్టాలి.
– బీసీలకు ఏం హామీ ఇచ్చారో.. అది ప్రభుత్వాలు నెరవేర్చాల్సిందే.
– లేదంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా.. బొంద పెడ్తాం..
– అవసరమైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మరో పోరాటం చేద్దాం.
– గ్రౌండ్ ను ఇంకా పటిష్టం చేయాలి. ఐక్యత ఉద్యమ నిర్మాణం చేయాలి.
– అన్ని కులాలుగా, వర్గాలుగా కొట్లాడుదాం.. అంతిమంగా బీసీలకు రాజ్యాధికారం తీసుకువచ్చేందుకు కృషి చేద్దాం.
-
తీన్మార్ మల్లన్న ఇంటి పేరు నాకు తెల్వదు : వట్టె జానయ్య
వట్టె జానయ్య..
– తీన్మార్ మల్లన్న ఇంటి పేరు నాకు తెల్వదు.. మీకు తెల్వదు. తీన్మార్ మల్లన్న పేరు ముందు.. తీన్మార్ తీసేసి.. బీసీ మల్లన్న పెట్టాలి.
– ఇప్పటి వరకు అగ్రవర్ణాలు..ఆర్డర్ వేస్తే.. ఊరికి 20 బండ్లలో జనం తీసుకొచ్చినం.. అని చెప్పేవాళ్లం మనం. అన్నీ పక్కకు పెట్టి బీసీల కోసం బయలుదేరిన తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇవ్వాల్సి ఉన్నది.
– బీసీలంతా ఒకే కులం.. బీసీకులం. ఈ నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– రెడ్ల ఓట్లు అవసరం లేదని మన బీసీ నాయకులు ధైర్యంగా చెప్పొచ్చు.. కానీ బీసీల ఓట్లు అవసరం లేదని చెప్పే ధైర్యం అగ్రవర్ణాలకు ఉన్నదా?
– కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే.. ఆ పార్టీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ తెలిసిందే. బీసీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా వంచించింది. బీసీలకు అన్యాయం చేసే పార్టీలను బొందపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– బీసీ కుటుంబాలను చైతన్య పరుచుదాం.. ప్రతి బీసీ బిడ్డ.. వంద మందితో సమానం.
– ఎవరో మనకు టికెట్ ఇవ్వాలి.. ఎవరో మనకు సీటు అవ్వాలనే స్థితి నుంచి.. మనమే టికెట్లు, సీట్లు ఇచ్చే పరిస్థితి రావాలి.
– బిడ్డా.. 70 కేసులు కాదు.. 170 పెట్టినా.. నీకు సరెండర్ అయ్యేది లేదు.
– మనకు ఒక నాయకుడు వచ్చిండు.. తీన్మార్ మల్లన్న.
– గత బీఆర్ఎస్ పాలనలో అసువులు బాసింది.. బీసీ బిడ్డలు, జైళ్లకు వెళ్లింది బడుగులు.
– 5 శాతం జనాభా ఉన్నవాళ్లకు 10 శాతం రిజర్వేషన్ ఎట్ల ఇస్తరు?
– మన జాతి కోసం.. మనమే కొట్లాడాలి తప్ప.. బాంచన్ దొరకు చరమగీతం పాడాలి.
– బీసీల కోసం పోరాడుతున్న మమ్మల్ని.. మారోజు వీరన్న, బెల్లి లలితక్క లేక అమరులను చేస్తారా? లేదా తీన్మార్ మల్లన్న కేబినెట్ లో నేను మంత్రినో, ఎమ్మెల్యేనో చేస్తారా.. బీసీల చేతిలోనే ఉంది.
– ఇంకా నాలుగేండ్ల సమయం ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది.
-
ఇప్పటి నుంచి ఓట్లు మనవే.. సీట్లు మనవే.
బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ చైర్మన్
రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు– ఒక బీసీ సభకు ఇంత పెద్ద ఎత్తున జనం రావడం చైతన్యం పెరిగిందని చెప్పొచ్చు.
– ఇప్పటి నుంచి ఓట్లు మనవే.. సీట్లు మనవే.
– ఈ సభ ఉద్దేశం.. రాజ్యాధికారం మనదే అని చాటి చెప్పడం.
– రాజ్యాధికారం లేకపోవడం వల్లే మనం అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నాం.
– గత 75 ఏండ్లుగా బీసీల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ వస్తున్నది. గత అసెంబ్లీలో 23 మంది ఉన్న ఎమ్మెల్యేలు.. ఇప్పుడు 19 మంది అయ్యారు.. ఈ పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం ఉన్నది.
– అన్ని పార్టీలు ఈ దేశంలో బీసీలను మోసం చేసినవే..
– మండల కమిషన్ అమలు చేసే నాటికి.. ఉద్యోగాల్లో ఉన్న బీసీలు 4 శాతం కూడా లేరు.
– విద్య, ఉద్యోగాలు,రాజకీయ రంగాల్లో బీసీలు మోసపోయారు.
– అన్ని కావాలంటే.. రాజ్యాధికారం ఒక్కటే మార్గం.
– ఎస్సీలు, ఎస్టీలకు జనాభా అనుగుణంగా వారికి రిజర్వేషన్ ఉంది. మరి బీసీలు 60 శాతం ఉంటే వారికి ఉన్న రిజర్వేషన్లు ఎంత?
– 4 శాతం జనాభాకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చుడేంది?
– మనం పోరాటం చేయడం వల్లే సర్కారు దిగొచ్చి.. కులగణన చేపట్టింది.
– భవిష్యత్తులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అన్యాయంపైనా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది.
– అన్యాయాలపై చదువుకున్న బీసీ యువత పోరాటానికి సిద్ధమవ్వాలి.
– బీసీలు ఎప్పుడూ యాచించే స్థాయిలో ఉండటం కాదు.. ఇచ్చే స్థాయిలో ఉండాలి.
– తమిళనాడులో బీసీలకు 50 శాతం ఉన్నది. ఇక్కడ మనం 20 శాతానికే సంబురపడుతున్నం.
– ఈ బీసీ గర్జన సభ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించాలి.
– తెలంగాణకు బీసీ సీఎం కావాలి.
-
పుట్ట మధు కామెంట్స్..
– ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చిన. బీపీ మండల్ గారిని తెలంగాణలో ఆవిష్కరించే అవకాశం నాకు వచ్చింది.
– మిర్యాలగూడలో జరిగిన ఈ బీసీ గర్జన..
– మాకు మాత్రమే పరిపాలన దక్షత ఉన్నదని.. రేవంత్ రెడ్డి అన్నప్పుడు అన్ని బీసీ వర్గాలు గొంతెత్తి ఉండాల్సిందే.
– మంథనిలో మూడు ఓట్లు ఉన్న ఓ కుటుంబం.. 50 ఏండ్లుగా పాలిస్తున్నది.
– బీసీలను గూండాలుగా, రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
– మల్లన్న పిలుపు మేరకు ఈ గర్జనకు వచ్చిన.
– టీచర్స్ ఎన్నికల్లో ఓ బీసీ బిడ్డ.. పోటీ పడితే.. ఎలాంటి అవమానాలు జరిగాయో చెప్పలేని పరిస్థితి.
– జై తెలంగాణ.. జై బీసీ..
-
సభా ప్రాంగణానికి చేరుకున్న తీన్మార్ మల్లన్న
ర్యాలీగా భారీ జన సందోహం నడుమ స్టేజ్ మీదకు మల్లన్న
మల్లన్నతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డ జనం తోపులా
Related News
-
బీసీలకు ప్రధాన శత్రువు రేవంత్ రెడ్డి- తీన్మార్ మల్లన్న
-
నాదర్గుల్ DPSలో SLC కార్యక్రమం
-
భారత్ – బంగ్లా మధ్య ప్రపంచ భవిష్యత్ ప్రణాళిక సమావేశం
-
పల్లవి స్కూల్లో పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ సెషన్
-
బోయిన్ పల్లి పల్లవి స్కూల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
-
ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ టోర్నమెంట్లో పల్లవి స్కూల్ హవా