అమితాబ్ బచ్చన్ గురించి ఎవరికి తెలియని విషయాలు ఇవే
82 ఏళ్లు వచ్చినా వయస్సుతో సంబంధం లేకుండా సినిమాల్లో అదరగొడతున్నారు బిగ్ బీ. నేటితో ఆయనకు 82 ఏళ్లు వచ్చాయి.

ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలపాటు బాలీవుడ్ ని ఏలిన అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు నేడే. అభిమానులు ఆయనను బిగ్ బీ అని పిలుచుకుంటారు. అంటే బాలీవుడ్ కి ఆయనే బిగ్ కాబట్టి బిగ్ బీ అని అంటారంతా. ఎన్నో సినిమాల్లో నటించి అగ్రకథానాయకుడిగా ఎదిగిన అమితాబ్ బచ్చన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. 82 ఏళ్లు వచ్చినా వయస్సుతో సంబంధం లేకుండా సినిమాల్లో అదరగొడతున్నారు బిగ్ బీ. ఇటీవల విడుదలైన కల్కీ సినిమాలో అశ్వత్థామ పాత్రలో బిగ్ బీ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం బిగ్‌బీ సినిమాలు, షోలు, యాడ్స్‌తో తీరిక లేకుండా ఉంటున్నారు. అయితే బిగ్ బీ గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
–1942 అక్టోబర్ 11న అలహాబాద్‌లో జన్మించారు. ప్రఖ్యాత హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ తండ్రి. అమితాబ్‌కు మొదటిగా ఇంక్విలాబ్ అని పేరు పెట్టారు. బచ్చన్ అనేది అమితాబ్ ఇంటి పేరు కాదు. ఆయన తండ్రి హరివంశ్ రాయ్ కలం పేరు బచ్చన్.
–హరివంశ్ రాయ్ రెండో భార్య తేజీ బచ్చన్ మొదటి కొడుకు అమితాబ్. అమితాబ్ కు అజితాబ్ అనే తమ్ముడు ఉన్నారు. అజితాబ్ బిజినెస్ లో రాణిస్తున్నారు.
–అమితాబ్,ఆయన తమ్ముడు ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ కూడా చదువుకున్నారు.
-అమితాబ్ బచ్చన్ రెండు పుట్టిన రోజులు జరుపుకుంటారు. ఆగస్టు 2న కూడా ఆయన తన బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారు. దీనికి వెనుక ఓ ప్రత్యేక,ఎమోషనల్ రీజన్ ఉంది. 1982లో కూలీ సినిమా షూట్ సమయంలో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు భారీగా రక్రస్రావం అయింది. ఆయన బతుకుతాడని ఎవరూ ఊహించలేదు. అయితే డాక్టర్లు ఆయనను శ్రమించి ఆగస్టు 2న సృహలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆ రోజున కూడా అమితాబ్ పుట్టిన రోజుని జరుపుకుంటారు.
–అమితాబ్ ఒకేసారి రెండు చేతులతో రాయగలరు. చాలాసార్లు అభిమానులకు ఇలా ఆటోగ్రాఫ్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు.
–ఢిల్లీలో బీఎస్సీ చదువుకున్న అమితాబ్..మొదట కొన్నాళ్లు కోల్ కతాలో ఓ షిప్పింగ్ కంపెనీలో వర్క్ చేశారు. అయితే నటనపై ఆసక్తితో ఆ తర్వాత జాబ్ వదిలేసి ముంబై వెళ్లారు.
–మొదటిగా 1969లో భువన్ షోమ్ అనే సినిమాకి అమితాబ్ వాయిస్ అందించారు. ఆ తర్వాత అదే ఏడాది ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వంలో సాత్ హిందుస్తానీ సినిమాతో తెరంగేట్రం చేశారు.
–తొలి సినిమాతో న్యూ కమర్ విభాగంలో అవార్డు అందుకున్నారు అమితాబ్..తర్వాత వరుసగా ఆయన నటించిన 12 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. జంజీర్ సినిమాతో తిరుగులేని నటుడిగా గుర్తింపు..షోలేతో అసలు ఆ క్రేజ్ రెట్టింపు అయింది.
-పుణె టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో అమితాబ్ జయని కలిశారు. ఈ తర్వాత జంజీర్ అనే సినిమాలో ఆమెతో కలిసి నటించారు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించగా అదే ఏడాది అంటే 1973లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి అభిషేక్ బచ్చన్,శ్వేతాబచ్చన్ అనే ఓ,కూతరు,కొడుకు ఉన్నారు.
–200కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలతో అభిమానులను అలరించారు.
–20కి పైగా సినిమాల్లో విజయ్ అనే పాత్రను అమితాబ్ పోషించడం ఓ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
–బాలీవుడ్ లో ఎక్కువ సినిమాల్లో డ్యూయల్ రోల్ చేసిన నటుడు అమితాబే.
–అమితాబ్ బచ్చన్ 1984లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే గెలిచినా కూడా మూడేళ్లకే పదవికి రాజీనామా చేశారు.
–1992 నుంచి అమితాబ్ 5 ఏళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్నారు. సొంతంగా నిర్మాణ సంస్థ నిర్మించి నష్టపోయారు. ఆ తర్వాత కౌన్ బనేగా కరోడ్ పతితో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు.
2000లో లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అమితాబ్ మైనపు విగ్రహం పెట్టారు.
–సినీ రంగంలో ఆయన అందుకోని అవార్డులు లేవు.
–2013లో ది గ్రేట్ గాట్స్ బీ అనే సినిమాతో అమితాబ్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
–భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషన్ ని కూడా 2015లో అమితాబ్ అందుకున్నారు.
–అమితాబ్ ఆస్తుల విలువ రూ.3190 కోట్లు ఉన్నట్లు సమాచారం. బ్యాంక్ బ్యాలెన్స్ 120 కోట్ల రూపాయలకు పైగా ఉంది. రూ.260 కోట్లు విలువ చేసే ఓ ప్రైవేట్ జెట్ విమానం కూడా అమితాబ్ దగ్గర ఉంది. ముంబైలో జుహులో ఆయన ఉంటున్న ఇంటి ధర 112 కోట్ల రూపాయలు. బిగ్ బీకి ముంబైలోని చాలా ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు ఉన్నాయి. అమితాబ్ వద్ద బెంట్లీ, రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్ వోగ్ మొదలైన కార్లు ఉన్నాయి. దీంతో పాటు లెక్సస్, ఆడి, బెంజ్ కంపెనీలకు చెందిన కార్లు కూడా ఉన్నాయి.
Related News
-
బన్నీ.. మేమంతా మీ ఫ్యాన్స్
-
కౌన్ బనేనా కరోడ్ పతిలో పవన్ పై ప్రశ్న..బిగ్ బీ భలే అడిగాడుగా!
-
Kalki 2898 AD OTT: మరికొన్ని గంటల్లో OTTకి వస్తున్న కల్కి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Arshad Warsi: ప్రభాస్ జోకర్లా ఉన్నాడు.. బాలీవుడ్ నటుడు సంచలన కామెంట్స్
-
ఆ ఫోటోలు, సీన్స్ మార్చండి.. మిస్టర్ బచ్చన్ సినిమాకు సెన్సార్ బోర్డు బిగ్ షాక్
-
Krishna Vamshi: అభిషేక్‌తో మురారి.. కాల్ చేసిన అమితాబ్