బన్నీ.. మేమంతా మీ ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘అల్లుఅర్జున్.. మీ మాటలకు చాలా కృతజ్ఞుడ్ని.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘అల్లుఅర్జున్.. మీ మాటలకు చాలా కృతజ్ఞుడ్ని. నా అర్హత కంటే ఎక్కువ చెప్పారు. మీ పని & ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులం. మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండండి. మీకు మరిన్ని సక్సెస్లు రావాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.
అయితే ఇటీవల అల్లు అర్జున్ అమితాబ్ గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అమితాబ్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పుకొచ్చాడు. అయితే ఆ కామెట్స్ పైనే ఇప్పుడు అమితాబ్ స్పందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.