Krishna Vamshi: అభిషేక్‌తో మురారి.. కాల్ చేసిన అమితాబ్

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహేష్ బాబు మురారి రీ రిలీజ్ గురించే చర్చ నడుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సంధర్బంగా ఆగస్టు 9న రీ రిలీజ్ అయ్యింది మురారి మూవీ. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి, మరీ ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దాంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. రీ రిలీజ్ లో అప్పటివరకు ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది ఈ మూవీ. దాంతో.. బాబులకే బాబు మహేష్ బాబు అంటూ సోషల్ మీడియాలో హంగామా చేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే.. రీ రిలీజ్ లో మురారి సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి సంతోషం వ్యక్తం చేశారు ఆ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆయన. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మురారి సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.. అప్పట్లో మురారి సినిమా చూసి బిగ్ బీ అమితాబ్ గారు నాకు ఫోన్ చేశారు. సినిమా బాగా నచ్చిందని, తన కుమారుడు అభిషేక్ తో బాలీవుడ్ లో రీమేక్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు కృష్ణవంశీ. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Related News
-
అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు
-
అలా చేస్తే ఫ్యూచర్ ఉండదు.. నెటిజన్ ప్రశ్నకు చై సూపర్ కౌంటర్
-
వేట మొదలెట్టిన జక్కన్న.. ఈసారి డిఫరెంట్ టైటిల్
-
ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. కన్నప్ప నుండి ప్రభాస్ లుక్ వచ్చేసింది
-
ఆయన ఒక లెజెండ్.. ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
బాధ్యత గల భాగస్వామిని.. రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసిన రష్మిక