ఆ ఫోటోలు, సీన్స్ మార్చండి.. మిస్టర్ బచ్చన్ సినిమాకు సెన్సార్ బోర్డు బిగ్ షాక్

రవితేజ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. సినిమా ఆగస్టు 15న గురువారం రోజున గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రీమియర్స్ బుధవారం సాయంత్రం నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయాలని మేకర్స్ కు సెన్సార్ బోర్డు సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో కనిపించే అమితాబ్ బచ్చన్, రేఖల ఫొటో స్థానంలో అమితాబ్, – జయా బచ్చన్ల ఫొటోను పెట్టాలని సెన్సార్ బోర్డు సూచించినట్టు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా కొన్ని అసభ్యకర సంభాషణలతో పాటుగా ఓ చిన్నారి పొగతాగుతూ కనిపించిన రెండు నిమిషాల నిడివిగల సీన్‌ని మార్చాలని, రక్తపాతానికి సంబంధించిన పలు సీన్స్‌ను మార్చడమో లేకా తొలగించడమో చేయాలని బోర్డు ఆదేశించినట్టు సమాచారం. 2 గంటల 30 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది.U/A సర్టిఫికేట్ జారీ చేయడానికి ముందు చిత్రంలోరి ఈ మార్పులు చేయాలని సెన్సార్ బోర్డ్ మిస్టర్ బచ్చన్ నిర్మాతలను కోరినట్లుగా వార్తలు వెలువడ్డాయి.