నమ్మలేకపోతున్నా.. నేను చెప్పేది ఒక్కటే
మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మరాఠి బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా అంతగా ఆడకపోయినా అవకాశాలు మాత్రం బాగానే దక్కించుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ‘‘2024 దాదాపు ముగిసింది. ఈ విషయాన్నీ నేను నమ్మలేకపోతున్నాను.

త్వరలో కొత్త ప్రారంభం, కొత్త సంవత్సరం మన ముందుకు రాబోతుంది. నేను నవ్వాను, ఏడ్చాను, ఎన్నో కలలు కన్నాను, కష్టాలు కూడా చూశాను. అయితే నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు. చాలా ప్రేమను మీ నుంచి పొందాను. మీ అందరితో పంచుకోవడానికి ఇంకా చాలా కథలు ఉన్నాయి’’ అంటూ రాసుకొచ్చింది. ఇక భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం రామ్ పోతినేని, విజయ్ దేవరకొండలతో సినిమాలు చేస్తోంది.