డ్రగ్స్ కు అలవాటు కావొద్దు – యువతకు వీడీ పిలుపు

పల్లవి, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం కార్యక్రమం హైదరాబాద్ లోని శిల్పా కళావేదికలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ” ఇండియాలో యువత సంఖ్య ఎక్కువ.
దేశాన్ని నాశనం చేయడానికి యుద్ధం, ఉగ్రవాదమే కారణాలు కాకుండా డ్రగ్స్ అలవాటు చేసి యూత్ ను అటాక్ చేస్తున్నారు. యూత్ ను పాడు చేసి దేశాన్ని అభివృద్ధి కాకుండా చూస్తున్నారు. ఇండియా నంబర్ వన్ గా ఉండాలంటే డ్రగ్స్ ను దగ్గరకు రానివ్వొద్దు” అని యువతకు పిలుపునిచ్చారు.