కాస్త తగ్గాడండోయ్.. హరీష్ శంకర్ కీలక నిర్ణయం
మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం మిస్టర్ బచ్చన్

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం మిస్టర్ బచ్చన్. షాక్, మిరపకాయ్ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత వీరి కాంబోలో సినిమా రావడంతో ఈ సినిమాపైన అంచనాలను భారీ స్థాయిలో ఉండిపోయాయి. అయితే ఆ అంచనాలకు అందుకోలేక మిస్టర్ బచ్చన్ ఢీలా పడిపోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్ కావడంతో దర్శకుడు హరీశ్ శంకర్ పైన సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ చేశారు ఫ్యాన్స్. సినిమా రిలీజ్ కు ముందు పెద్ద పెద్ద డైలాగ్ లు కొట్టిన హరీష్.. సినిమాను మడత పెట్టేశాడంటూ ఊతికారేశారు ఫ్యాన్స్.
అయితే ఈ సినిమాకు వచ్చిన నష్టాల వలన దర్శకుడు హరీశ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తుంది. అదేంటంటే ఈ సినిమాకు హరీష్ రూ.8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటే రూ.2 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. డిస్ట్రిబ్యూషన్ వల్ల నష్టపోయిన వాళ్లకు ఆ డబ్బులు ఇవ్వమని నిర్మాతను రిక్వెస్ట్ చేశారట హరీష్. కాగా ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. హరీష్ తన తదుపరి చిత్రాన్ని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై చేయనున్నారు. మరి అది కూడా రిమేకా లేదా అన్నది చూడాలి.