కౌన్ బనేనా కరోడ్ పతిలో పవన్ పై ప్రశ్న..బిగ్ బీ భలే అడిగాడుగా!
ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడంతో అభయ్ దంపతులు రూ. 1.60 లక్షలు గెలుచుకున్నట్లు బిగ్ బీ తెలిపారు.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్టుగా చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షో..మనదేశంలోనే కాదు విదేశాల్లో కూడా చాలా పాపులర్. ఈ షోని ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా చూసేవాళ్ల సంఖ్య భారీగానే ఉంటుంది. ఈ షోలో పాల్గొన్న చాలామంది లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెల్చుకొని లైఫ్ లో సెటిల్ అయినవాళ్లు ఉన్నారు..అదేసమయంలో భారీగా వచ్చిన డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేసి మళ్లీ రోడ్డున పడ్డవాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ 16వ సీజన్ కొనసాగుతోంది.
అయితే కౌన్ బనేనా కరోడ్ పతి లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఓ ప్రశ్న అడిగారు అమితాబ్ బచ్చన్. 2024 ఎన్నికల్లో ఏపీలో ఓ నటుడు డిప్యూటీ సీఎం అయ్యారు, అతను ఎవరు?అని హాట్ సీట్ లో కూర్చున్న డాక్టర్ రాణి బ్యాంగ్, డాక్టర్ అభయ్ బ్యాంగ్ ని బిగ్ బీ అడిగారు. ఈ ప్రశ్నకు.. పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అనే నాలుగు ఆప్షన్లు ఇచ్చారు.
అభయ్ దంపతులకు ఆన్సర్ తెలియకపోవడంతో ఆడియెన్స్ పోల్కు వెళ్లారు. ఆడియెన్స్ లో ఎక్కువ మంది పవన్ కల్యాణ్ అని ఆన్సర్ చెప్పారు. అభయ్ కూడా పవన్ కల్యాన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడంతో అభయ్ దంపతులు రూ. 1.60 లక్షలు గెలుచుకున్నట్లు బిగ్ బీ తెలిపారు.