ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో జనసేన నేతకు అవమానం..

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలక పార్టీ అయిన జనసేనకు చెందిన ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియర్ నేత నాగబాబు సమక్షంలోనే జనసేన నాయకుడికి ఘోర అవమానం జరిగింది. రాష్ట్రంలోని విశాఖ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలతో జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ నాగబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు గోపీకృష్ణ ఆ వేదికపై మాట్లాడుతూ ‘ విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేనకు చెందిన కానీ ఆధిపత్యం అంతా టీడీపీదే నడుస్తుందని గోపీకృష్ణ అన్నారు.
ఈ అన్యాయాన్ని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ నాగబాబుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర అసహనానికి గురైన నాగబాబు గోపీకృష్ణ మైకును కట్ చేయాలంటూ అనుచరులకు ఆదేశించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ ‘ కూటమి సర్కారు ఏర్పడటానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , బీజేపీ నేతలు కృషి చేశారని చెప్పారు.
పదవుల విషయంలో నేతలు, కార్యకర్తలు అసంతృప్తితో ఉండకూడదు. దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఆయన వివరించారు. కూటమి పార్టీలోని నాయకుల , కార్యకర్తల మధ్య విబేధాలు తలెత్తితే సమన్వయ కమిటీ చూసుకుంటుందని నాగబాబు చెప్పారు. అయితే ఈ విషయంలో జనసేన నేతలు, కార్యకర్తలు స్పందించవద్దు అని సూచించారు.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు