Nithiin : కొత్త తారకు స్వాగతం.. తండ్రైన హీరో నితిన్
Nithiin : టాలీవుడ్ హీరో నితిన్ తండ్రయ్యాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించాడు.

Nithiin : టాలీవుడ్ హీరో నితిన్ తండ్రయ్యాడు. పండంటి మగబిడ్డకు నితిన్ సతీమణి షాలిని జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించాడు. కొత్త తారకు స్వాగతం అంటూ నితిన్ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పంచుకున్నారు. దీంతో నితిన్ కు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. కాగా నితిన్ 2020 జులైలో షాలినిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం తమ్ముడు అనే సినిమాలో నటిస్తున్నారు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు దీన్ని నిర్మిస్తున్నారు.
Welcoming the NEWEST STAR 🌟 of our family!! ❤️ pic.twitter.com/otBHvwSnNo
— nithiin (@actor_nithiin) September 6, 2024