దేవర సినిమాను రిజెక్ట్ చేసిన ఇద్దరు టాప్ హీరోయిన్లు!
ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.
ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించింది. అయితే ముందుగా ఆమె స్థానంలో దర్శకుడు కొరటాల శివ అలియా భట్ ను అనుకున్నారు. కానీ అప్పటికే ఆమె ఆర్ఆర్ఆర్ లో కనిపించడంతో బ్యాక్ టూ బ్యాక్ వద్దనుకుని ఆమెను పక్కన పెట్టి.. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ తీసుకుందామని అనుకున్నారు. ఆమెను అప్రోచ్ అయి కథను కూడా వినిపించారు కొరటాల. కానీ మిగితా ప్రాజెక్టులతో బిజీగా ఉంటడంతో ఈ సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నారు మృణాల్.
ఇక మరో హీరోయిన్ కోసం రష్మికను అనుకున్నారు కానీ ఆమె ఆ పాత్రపై అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫైనల్ గా మళ్లీ బాలీవుడ్ హీరోయిన్ ల వైపే లుక్ వేసిన కొరటాల జాన్వీ కపూర్ ను ఫస్ట్ పార్ట్ కు హీరోయిన్ గా తీసుకున్నారు. ఇంకో హీరోయిన్ గా మరాఠీ నటి శ్రుతి మరాఠేను తీసుకున్నారు. ఈమె దేవర పార్ట్ 2లో కనిపించనుంది. ఈమె పాత్ర తక్కువే అయిన ఇంఫాక్ట్ ఉంటుందని తెలుస్తోంది.



