బంపరాఫర్ .. వరంగల్ బ్యూటీకి ‘లక్కీ’ ఛాన్స్
వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, కానీ గౌరవం కావాలంటే డబ్బు మన ఒంటిపై కనిపించాలంటున్నాడు లక్కీ భాస్కర్.

వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, కానీ గౌరవం కావాలంటే డబ్బు మన ఒంటిపై కనిపించాలంటున్నాడు లక్కీ భాస్కర్. మళయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరీ హీరోహీరోయిన్లుగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య రూపొందిస్తున్న ఆ సినిమాను దీపావళి పండగ సందర్భంగా ఆక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల చేశారు. చాలీచాలని జీతంతో మధ్యతరగతి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భాస్కర్…ఎలా డబ్బు సంపాదించాడో సినిమాలో చూపించారు. ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది. సిగరెట్, అల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువంటూ వచ్చే డైలాగ్ ఆకట్టుకుంటుంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ ట్రైలర్ ఓ అమ్మాయి దృష్టిని ఆకర్షించింది. ఆమెనే అనన్య. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అందరికీ సుపరిచుతురాలైన అనన్య 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ద్వారా బాగా ఫేమ్ సంపాదించుకుంది. ఈ వెబ్ సిరీస్ తో ఆమె ఓవర్‌నైట్ యూట్యూబ్ స్టార్‌గా మారింది . అనన్య శర్మ పుట్టి పెరిగిందంతా వరంగల్. చెన్నైలోని వీఐటీ కాలేజీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం ఉండటంతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తర్వాత ఈ భామకు కొన్ని సినిమాల్లో నటించి అవకాశం వచ్చింది. కానీ ఫుల్ లెంగ్త్ సినిమాలు రాలేదు. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాలో ఏకంగా హీరో పక్కనే మంచి పాత్ర దక్కింది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి క్రేజ్ ను తీసుకువస్తుందో చూడాలి.
Related News
-
‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ పై క్లారిటీ..!
-
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు.
-
Meenakshi Chaudhary : గ్లామరస్ మీనాక్షి
-
ఇంతకన్నా పెద్ద హిట్టు ఎవరైనా తీయగలరా: నాగ వంశీ
-
The GOAT Trailer: సరికొత్తగా గోట్ ట్రైలర్.. యాక్షన్‌తో అదరగొట్టిన విజయ్
-
The GOAT: ఫస్ట్ డే అన్ని థియేటర్స్‌లో గోట్ మూవీనే.. ఈ రికార్డ్ విజయ్‌కి మాత్రమే సాధ్యం