The GOAT: ఫస్ట్ డే అన్ని థియేటర్స్‌లో గోట్ మూవీనే.. ఈ రికార్డ్ విజయ్‌కి మాత్రమే సాధ్యం

తమిళ స్టార్ విజయ్ తలపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది గోట్(Greatest Of All Time). విలక్షణ చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి, సీనియర్ నటి స్నేహ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. విడుదలరోజు తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్స్ లో ది గోట్ సినిమాను ప్రదర్శించనున్నారట. ఇదే నిజమైతే ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు. అంతేకాదు.. మొదటిరోజు అన్ని థియేటర్స్ లో గోట్ సినిమా రిలీజ్ అయితే.. ఫస్ట్ డే కలెక్షన్స్ లో కూడా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనుంది ఈ సినిమా. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దట్ ఈజ్ విజయ్ అంటూ కామెంట్స్ చేస్తూ కాలర్ ఎగరేస్తున్నారు.
ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ వార్త గనుక నిజమైతే.. ఈ రికార్డ్ బ్రేక్ చేయడం వేరే ఏ హీరో వల్ల కాదనడంలో ఎలాంటి సందేహంలేదు. ఎందుకంటే.. మరే హీరోకీ కూడా ఇలాంటి అవకాశం రావడం కష్టమే. కాబట్టి. ది గోట్ సినిమా మొదటిరోజు ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయనుందో చూడాలి.