The GOAT Trailer: సరికొత్తగా గోట్ ట్రైలర్.. యాక్షన్తో అదరగొట్టిన విజయ్

తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి(Vijay Thalapathy) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). విలక్షణ చిత్రాల దర్శకుడు వెంకంట్ ప్రభు(Venkat Prabhu) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి, సీనియర్ నటి స్నేహ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మోడ్ లో వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.