ఇంతకన్నా పెద్ద హిట్టు ఎవరైనా తీయగలరా: నాగ వంశీ
టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ ప్రొడక్షన్ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి జంటగా నటించారు.

టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ ప్రొడక్షన్ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి జంటగా నటించారు. బ్యాంకింగ్ సెక్టార్స్ లో జరిగే స్కామ్ ల నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా దీపావళి పండుగ సందర్బంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరికొత్త కథా కథనాలతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి సైతం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దాంతో మొదటోరోజు రూ.12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ మూవీ . దాంతో లక్కీ భాస్కర్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.
ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. “లక్కీ భాస్కర్ సినిమా ఎవరూ ఒక్క నెగెటివ్ ను కూడా పట్టుకోలేకపోయారు. విడుదలకు ముందే ఇంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చాను. ఇంతకంటే పెద్ద హిట్ ఎవరైనా ఎవరైనా కొట్టగలరా? తప్పును పట్టుకోలేకపోయిందుకు పార్టీ ఇవ్వాలి” అంటూ చెప్పుకొచ్చారు నాగ వంశీ. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా రానున్న రోజుల్లో మరింత భారీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. మరి మీరు ఈ సినిమా చూశారా? చూడకపోతే వెంటనే చూసేయండి.