Bigg Boss 8 Telugu : బిగ్‌బాస్ లోకి కరీంనగర్ పిల్ల.. దిశ నిందితుడి భార్యకు రూ. 15 వేలు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. హౌస్ లోకి ఆరో కంటెస్టెంట్‌గా సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది. ఈమె గురించి చాలామందికి తెలియదు. పెద్దపల్లి జిల్లాలోని మంథినిలో పుట్టింది. ఈమె తండ్రి రైతు. తల్లి హోమ్ మేకర్. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పట్టా అందుకుంది. కలెక్టర్ కావాలని అనుకుంది. కానీ యాక్టర్ అయింది. జార్జ్ రెడ్డి సినిమాలో హీరో చెల్లిగా నటించింది. డైరెక్టర్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. దిశ ఎన్కౌంటర్ ఆధారంగా తెరకెక్కిన ఆశా ఎన్కౌంటర్లోనూ నటించింది. అంతేకాకుండా దిశ అత్యాచార నిందితుడి భార్య రేణుకు ఈమె రూ. 15 వేలు ఆర్థిక సహయం అందించింది. సోనియా ఆకులకు సమాజ సేవ అంటే చాలా ఇష్టం. తనవంతు సేవ చేయాలన్న కోరికతో ఆసా అనే సంస్థ ఏర్పాటు చేసింది.




