ఓటీటీకి ‘వేట్టయాన్’.. స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయాన్. దర్శకుడు టీజీ జ్ఞానేవెల్ తెరకెక్కించిన ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయాన్. దర్శకుడు టీజీ జ్ఞానేవెల్ తెరకెక్కించిన ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా సుమారు రూ. 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. వేట్టైయన్ నవంబర్ 8న ఓటీటీలో విడుదల కానున్నట్లు ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ విడుదల చేసింది. దీంతో ఓటీటీ ఆడియన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.



