Devara: శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నా: ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. కేవలం పదిరోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ. తాజాగా దేవర సినిమాకు ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ కి ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు ఎన్టీఆర్.
దేవర సినిమాపై మీరు చూపిన ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా హృదయంలో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దర్శకుడు కొరటాల శివ కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వల్లే ఈ ప్రాజెక్టు విజయవంతమైంది. నిర్మాతలు హరికృష్ణ కొసరాజు, సుధాకర్ మిక్కిలినేని, అనిరుధ్, రత్నవేలు, సాబూ సిరిల్, యుగంధర్, శ్రీకర్ ప్రసాద్ ఇలా సినిమాని అద్భుతంగా మలిచిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఇక గత నెల నుంచి ‘దేవర’ సినిమాని ఓ పండగలా జరుపుకొంటున్నందుకు నా కుటుంబ సభ్యులలాంటి అభిమానులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నా. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం మీ అభిమానమే. దేవర సినిమాను మీ భుజాలపై మోసినందుకు’ థాంక్ యూ” అంటూ రాసుకొచ్చాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



