ఓటీటీలో దేవర.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భా
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలు మధ్య తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇక దేవర సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్న నేపధ్యంలో దేవర ఓటీటీ విడుదల గురించి ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా దేవర ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. నవంబర్ 8 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో భారీ విజయాన్ని సాధించిన దేవర సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.



