రౌడీబాయ్‌తో మహానటి రొమాన్స్

మహానటితో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఈ మధ్య తెలుగులో ఎక్కువగా కనిపించడం లేదు. గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ‘బేబీ జాన్’తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. గతంలో హోమ్లీగా కనిపించే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోకి వెళ్లగానే తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. బేబీ జాన్‌తో ఆమె గ్లామర్‌కి నార్త్ జనాలు ఫిదా అయిపోయారు. దీంతో సినిమా డిజాస్టర్ అయినా కీర్తికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. పెళ్లి తర్వాత దూకుడు పెంచిన కీర్తి మళ్లీ టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. యంగ్ హీరోలతో ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.
నితిన్, వేణు కాంబినేషన్లో దిల్ రాజు నిర్మిస్తోన్న ఎల్లమ్మలో కీర్తి సురేష్ నటిస్తోందని ఇండస్ట్రీ టాక్. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా సాయిపల్లవిని అడగ్గా.. ఆమెకు డేట్స్ అడ్జట్ట్స్ కాకపోవడంతో నో చెప్పిందట. దీంతో ఆమె ఆఫర్ కీర్తి వద్దకు చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. తాజాగా ఈ భామ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పక్కన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన్ మూవీ చేయనున్నాడు. ఈ ప్రాజెక్టులో కీర్తి సురేష్‌ని తీసుకుంటే కాంబినేషన్ అదిరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట.
ఇక సుహాస్ పక్కన ఉప్పు కప్పురంబు మూవీ ఇప్పటికే కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే.ఇక బాలీవుడ్లో ‘బేబీ జాన్’ తర్వాత రాకింగ్ స్టార్ రణబీర్ కపూర్ పక్కన కీర్తి ఛాన్స్ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కే ఈ మూవీలో కీర్తి సురేష్ గ్లామర్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అయితే ప్రస్తుతం రామాయణ, లవ్ అండ్ వార్, యానిమల్ పార్క్ వంటి చిత్రాలతో రణబీర్ బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ లేదు. అంతేకాకుఉండా ఆమె లీడ్ రోల్లో నటించిన రివాల్వర్ రీటా విడుదల కావాల్సి ఉంది.
జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుని ‘మహానటి’గా కీర్తించబడుతోన్న కీర్తి సురేష్ ఇకపై కమర్షియల్ బాటలో నడుస్తూ గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలని తెగ ఆరాటపడుతోందట. చాలామంది హీరోయిన్లు కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ పాత్రలు చేసి పెళ్లి తర్వాత హోమ్లీగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. కీర్తి మాత్రం ఇన్నాళ్లూ కాస్త పద్ధతిగా కనిపించి పెళ్లి తర్వాత గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి తెగ కష్టపడుతోంది. బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత తత్వం బోధపడి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ఫాన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతోన్న కీర్తికి ఒకట్రెండు హిట్లు పడ్డాయంటే ఇప్పట్లో ఆమె కెరీర్‌కు ఢోకా ఉండదు.